వరద బాధితులకు మహేష్‌ విరాళం

వరద బాధితులకు మహేష్‌ విరాళం

కేరళను భారీ వర్షాలు, వరదలు కకావికలం చేశాయి. పలు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో.. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది కోట్ల నష్టం వాటిల్లింది. ఈక్రమంలో అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు కేరళకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. సినీ రంగానికి సంబంధించి ఇప్పటికే మెగా ఫ్యామిలీతోపాటు పలువురు ఆపన్న హస్తం అందించారు. ఇప్పుడు సూపర్‌స్టార్‌ మహేష్‌ భారీ విరాళాన్ని ప్రకటించారు. బాధితులకు చేయూతనందించేందుకు కేరళ సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు అందిస్తానని చెప్పారు.