మహేష్ అభిమాని సూటి ప్రశ్న... అతడ్ని మార్చండి ప్లీజ్

మహేష్ అభిమాని సూటి ప్రశ్న... అతడ్ని మార్చండి ప్లీజ్

మహేష్ మహర్షి స్థాయికి ఎదిగాడు.  నటుడిగా తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకున్న మహేష్ తన నెక్స్ట్ సినిమాకు సిద్ధం అవుతున్నాడు.  అనిల్ రావిపూడితో చేయబోతున్న ఈ సినిమా వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగబోతున్నది.  ఎఫ్ 2 తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.  ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.  

ఇదిలా ఉంటె, ఈ సినిమా గురించి మహేష్ అభిమాని నమ్రతకు ఇంస్టాగ్రామ్ లో ఓ మెసేజ్ పెట్టాడు.  "ఇండస్ట్రీలో చాలామంది కొత్త కొత్త సంగీత దర్శకులు వస్తున్నారు.  వారి మ్యూజిక్ బాగుంటోంది.  మంచి సింగర్స్ కూడా ఉన్నారు.  కానీ, మహేష్ బాబు దేవిశ్రీతోనే సినిమాలు చేస్తున్నారు.  శ్రీమంతుడు, భరత్ అనే నేను.. ఇప్పుడు మహర్షి... అన్ని ఒకేలా మూసపద్ధతిలో ఉంటున్నాయి.  దేవీశ్రీని మార్చండి లేదంటే... కొత్త సింగర్స్ అని అయినా తీసుకోండి. " అంటూ మెసేజ్ చేశాడు.  దేవిశ్రీతో కంఫర్ట్ గా ఉండటంతో మహేష్ దేవివైపే మొగ్గు చూపుతున్నారు.  కొత్త సింగర్స్ పరిచయం చేస్తూ పాటిస్తే బాగుంటుంది కదా.