మహేష్ ఫ్యాన్స్ బాధను జక్కన్న ఆలకిస్తారా..!!

మహేష్ ఫ్యాన్స్ బాధను జక్కన్న ఆలకిస్తారా..!!

రాజమౌళి ఆర్ఆర్ఆర్ బిజీలో ఉన్నారు.  ఈ సినిమా పూర్తయ్యి రిలీజ్ అయ్యే వరకు వేరే ఆలోచన ఏది పెట్టుకోడు.  ఆర్ఆర్ఆర్ జులై 30, 2020 న రిలీజ్ కాబోతుంది.  మరో సినిమా గురించి ఆలోచించాలి అంటే 2020 మిడిల్ వరకు ఆగాలి.  రాజమౌళి భారీ సినిమాలను ఎన్టీఆర్, ప్రభాస్, మెగా హీరోలను ఎంచుకుంటున్నారుగాని, మహేష్, అల్లు అర్జున్ లాంటి హీరోలవైపు ఎందుకు చూడటంలేదు అర్ధం కావడం లేదు.  

రాజమౌళితో సినిమా చేసేందుకు మహేష్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు.  ఇప్పటి వరకు వర్కౌట్ కాలేదు.  మహేష్ కు తగిన స్టోరీని రాజమౌళి సిద్ధం చేసుకోలేకపోయాడా... అసలు రాజమౌళి మదిలో అలాంటి ఆలోచన ఉందా లేదా అన్నది తెలియాలి.  ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్ తో సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలి.  ఆర్ఆర్ఆర్ పూర్తయ్యాక.. రాజమౌళి ... మహేష్ తోనే సినిమా చేస్తారా.. ఏమో చెప్పలేం.