మహేష్ హీరోయిన్ ఫస్ట్ లవ్ సీక్రెట్స్

మహేష్ హీరోయిన్ ఫస్ట్ లవ్ సీక్రెట్స్

మహేష్ బాబు హీరోగా చేసిన భరత్ అనే నేను సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్.  ఈ సినిమాతో ఆమె పేరు మారుమ్రోగిపోయింది.  సెకండ్ సినిమా రామ్ చరణ్ వినయ విధేయ రామ చేసింది.  ఈ మూవీ ఫ్లాప్ కావడంతో కియారకు టాలీవుడ్ లో ఆఫర్లు రావడం లేదు.  బాలీవుడ్ లో మాత్రం వరసగా సినిమాలు చేస్తోంది.  

ప్రస్తుతం కియారా కబీర్ సింగ్ చేస్తున్నది.  ఈ మూవీ జూన్ 21 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది.  తన ఫస్ట్ లవ్ గురించి మాట్లాడుతూ.. అనేక విషయాలు చెప్పింది.  తాను 10 వ తరగతిలోనే ప్రేమలో పడ్డానని చెప్పింది.  10 వ తరగతిలో ఉండగా ఓ అబ్బాయిని ప్రేమించానని, ఇంట్లో వాళ్ళు ఆ వయసులో ప్రేమ ఏంటి చదువుకోమని చెప్పడంతో బ్రేకప్ చెప్పి చదువులో మునిగిపోయానని చెప్పింది.  ఇప్పుడు ప్రేమించే సమయం లేదని అంటోంది కియారా.