మరో ఘనత సాధించిన మహేష్ !

మరో ఘనత సాధించిన మహేష్ !

టైమ్స్ మ్యాగజైన్ ప్రతి యేటా మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాను తయారుచేస్తుంటుంది.  దానితో పాటే ఫరెవర్ డిజైరబుల్ క్లబ్ పేరుతో ఇంకో జాబితాను ప్రకటిస్తుంది.  ఈ జాబితాకు ఒక ప్రత్యేకత ఉంది.  అదేమిటంటే ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో టాప్ స్థానంలో నిలుస్తున్న కొందరికి మాత్రమే ఇందులో చోటుంటుంది.  ఈ క్లబ్‌లో చోటు దక్కినవాళ్ల పేర్లు మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో ఉంచరు.  ఎందుకంటే మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో కొత్తవారికి చోటు కల్పించడం కోసమే. 

ఇప్పటి వరకు ఈ జాబితాలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, ఆమీర్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రమే ఉన్నారు.  ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆ లిస్టులో చోటు దక్కించుకున్నారు.  ప్రతిసారి మహేష్ మోస్ట్ డిజైరబుల్ జాబితాలో టాప్ స్థానంలో వస్తుండటంతో ఆయన పేరును ఫరెవర్ డిజైరబుల్ క్లబ్‌లో చేర్చేశారు.