మహేష్ హీరోయిజం ఆ 25 నిమిషాల్లో కనిపిస్తుంది..!!

మహేష్ హీరోయిజం ఆ 25 నిమిషాల్లో కనిపిస్తుంది..!!

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో పూర్తి చేసుకొని హైదరాబాద్ కు షిఫ్ట్ అయిన సంగతి తెల్సిందే.  ప్రస్తుతం హైదరాబాద్ లో కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.  ట్రైన్ ఎపిసోడ్, రాయలసీమకు సంబంధించిన సీన్స్ ఈ షెడ్యూల్లో చిత్రీకరణ చేస్తారు.  పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు యాక్షన్ ఎపిసోడ్స్ ను కూడా భారీ స్థాయిలో ఉండబోతున్నాయని వినికిడి.  

మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ గెటప్ లో వీరోచిత పోరాటాలు ఉంటాయని, మహేష్ ఇంట్రో సీన్స్ కూడా అదిరిపోయే విధంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.  మహేష్ ఆర్మీ ఆఫీసర్ రోల్ మొత్తం మీద సినిమాలో 25 నిమిషాల పాటు ఉంటుందట.  ఈ 25 నిముషాల ఎపిసోడ్ ఫ్యాన్స్ మెచ్చేలా, నచ్చేలా ఉంటుందని యూనిట్ చెప్తోంది.  విజయశాంతి కీలక పాత్ర చేస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్.  వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.