'సరిలేరు నీకెవ్వరు' అంటున్న మహేష్ !

'సరిలేరు నీకెవ్వరు' అంటున్న మహేష్ !

అనిల్ రావిపూడి డైరెక్షన్లో మహేష్ బాబు చేయనున్న చిత్రం ఈరోజే లాంచ్ కానుంది.  ఈ సినిమాకు ముందు నుండి అనుకుంటున్నట్టు 'సరిలేరు నీకెవరు' అనే పేరునే ఫైనల్ చేశారు.  టైటిల్ పోస్టర్ చూస్తే సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్లో నడిచే కథగా ఉంటుందని అర్థమవుతోంది.  సినిమాలో సందేశంతో పాటు బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఉండనుంది.   దిల్ రాజు, మహేష్ బాబు, సుంకర రామబ్రహ్మం కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి విడుదలచేయనున్నారు.  'మహర్షి' తర్వాత మహేష్ చేస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.