జూన్ నుండి స్టార్ట్ చేస్తాడట మహేష్ !

జూన్ నుండి స్టార్ట్ చేస్తాడట మహేష్ !

 

మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే.   ఈ ఏడాది ఆరంభంలో రావిపూడి 'ఎఫ్ 2' లాంటి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో మహేష్ అతనికి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు.  వీరిద్దరి సినిమా జూన్ నెలలో అధికారికంగా లాంచ్ కానుంది.  రెగ్యులర్ షూట్ జూలై నెలలో మొదలవుతుందట.  ఈ సినిమా కూడా రావిపూడి గత చిత్రాల్లానే ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.  చాలా ఏళ్ల తర్వాత మహేష్ పూర్తిగా జానర్ మార్చి ఒక భిన్నమైన ఎటెంప్ట్ చేస్తుండటంతో ప్రేక్షకులు, అభిమానులు ప్రాజెక్ట్ పట్ల ఆసక్తిగా ఉన్నారు.