మహేష్ బాబు పోలీస్ కాదు !

మహేష్ బాబు పోలీస్ కాదు !

ఇటీవలే 'మహర్షి' చిత్రంతో విజయాన్ని అందుకున్న మహేష్ బాబు ఇంకొద్ది రోజుల్లో అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు.  ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారి కనిపిస్తారని వార్తలు వచ్చాయి.  కానీ మహేష్ సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ఈ వార్త నిజం కాదని, మహేష్ పోలీస్ పాత్ర చేయట్లేదని తెలిసింది.  మరి మహేష్ కోసం అనిల్ రావిపూడి ఎలాంటి పాత్రను డిజైన్ చేశారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.