అందరి ముందు కాలర్ ఎగరేసిన మహేష్ !

అందరి ముందు కాలర్ ఎగరేసిన మహేష్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' సినిమా విజయాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నారు.  తాజాగా జరిగిన సక్సెస్ మీట్లో మాట్లాడిన ఆయన దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రీరిలీజ్ వేడుకలో అభిమానులు కాలర్ ఎగరేసుకునే సినిమా ఇస్తానని అన్నారు.  నా అభిమానులు కాలర్ ఎగరేశారు.  ఇప్పుడిక నా వంతు అంటూ స్టేజి మీద తన చొక్క కాలర్ పైకి లేపారు.  తన 25వ సినిమాను ఎప్పటికీ  మర్చిపోలేని విజయంగా మలచినందుకు మహేష్ వంశీ పైడిపల్లికి కృతజ్ఞతలు తెలిపారు.