సుకుమార్ స్టోరీ.. రిజెక్ట్ చేసిన మహేష్ !

సుకుమార్ స్టోరీ.. రిజెక్ట్ చేసిన మహేష్ !

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో సుకుమార్ ప్రాజెక్ట్ కూడ ఒకటి.  గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 'వన్ నేనొక్కడినే' వచ్చి ఉండటంతో ఈసారి కూడ భిన్నమైన సినిమానే ఆశిస్తున్నారు ప్రేక్షకులు.  సుకుమార్ కూడ కొంచెం డిఫరెంట్ స్టోరీనే మహేష్ బాబుకు చెప్పాడట.  కానీ మహేష్ అంత రిస్క్ తీసుకోవడం ఇష్టంలేక ఆ కథకు నో చెప్పాడట. 

దీంతో సుకుమార్ మరో కొత్త కథను తయారుచేసే పనిలో పడ్డారని వినికిడి.  ఈ చిత్రాన్ని నిర్మించబోతున్న మైత్రీ మూవీ మేకర్స్ కూడ ఇంకా కథ సిద్ధం కాలేదని గతంలోనే వెల్లడించింది.  ఒక కథకు మూడు నుండి  నాలుగు నెలలు సమయం తీసుకునే సుకుమార్ ఏప్రిల్ నాటికి మహేష్ కు కొత్త కథ చెప్పే అవకాశాలున్నాయి.