సుకుమార్.. రాజమౌళి గురించి మహేష్ ఏమన్నారంటే

సుకుమార్.. రాజమౌళి గురించి మహేష్ ఏమన్నారంటే

మహర్షి సినిమా మే 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలు మాట్లాడారు.  

ముఖ్యంగా సుకుమార్ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టడానికి గల కారణాలను ఈ ఇంటర్వ్యూలో మహేష్ చెప్పారు.  మహర్షి తరువాత ఓ ఎంటర్టైనర్ సినిమా చేద్దామని అనుకున్నామని, కానీ, సుకుమార్ ఇంటెన్సివ్ స్టోరీతో ముందుకు రావడంతో ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్టు మహేష్ చెప్పారు.  సుకుమార్ కూడా హ్యాపీగా ఫీలయ్యారని ఫ్యూచర్ లో ఇద్దరం కలిసి తప్పకుండా మరలా వర్క్ చేస్తామని అన్నారు.  రాజమౌళితో సినిమా ఉంటుందని, దానిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు మహేష్.