సుదర్శన్ నా సొంత థియేటర్ : మహేష్

సుదర్శన్ నా సొంత థియేటర్ : మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ సినిమా హాలుకు వెళ్లి అభిమానుల్ని పలకరించారు.  ఈ సందర్బంగా మాట్లాడిన అయన ఏఎంబి సినిమా హాళ్లలో నేను భాగస్వామిని.  అయినా సుదర్శనే నా సొంత థియేటర్ అనుకుంటాను.  నాన్నగారితో కలిసి మురారి సినిమా ఇక్కడే చూశాను.  ఆరోజుల్ని మర్చిపోలేను.  మహర్షితో పాటు నా కెరీర్లోని మంచి సినిమాలన్నీ ఈ థియేటర్లో విడులయ్యాయి.  సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు అన్నారు.  వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్ళను సాధిస్తూ దూసుకుపోతోంది.