మహేష్, సుకుమార్ సినిమా ఉంటుందట !

మహేష్, సుకుమార్ సినిమా ఉంటుందట !

 

'మహర్షి' తర్వాత మహేష్ బాబు సుకుమార్ సినిమా చేయాల్సి ఉంది.  కానీ కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.  సుకుమార్ అల్లు అర్జున్ హీరోగా సినిమాను అనౌన్స్ చేశాడు.  దీంతో సుకుమార్, మహేష్ మధ్య పెద్ద విభేదాలే ఏర్పడ్డాయని అనుకున్నారంతా.  కానీ అలాంటివేం లేవని తేలిపోయింది.  సుకుమార్ చెన్నైలో మహర్షి షూటింగ్ జరుగుతున్న చోటుకి వెళ్లి మహేష్ బాబుని కలిశాడు.  మహేష్ కూడా త్వరగా కథ రెడీ చేయమని సుకుమార్ తో చెప్పినట్టు తెలుస్తోంది.  సో.. కొంచెం ఆలస్యమైనా వీరిద్దరూ కలిసి సినిమా చేయడం మాత్రం ఖాయమనిపిస్తోంది.