నా అభిమానులకి కృతజ్ఞతలు : మహేష్

నా అభిమానులకి కృతజ్ఞతలు : మహేష్

మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం నిన్న విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ఇది తన 25 వ చిత్రం కావడంతో మహేష్ సైతం ఈ విజయాన్ని ప్రత్యేకంగా తీసుకున్నారు.  సినిమాను ఇంత పెద్ద విజయం చేసినందుకు అభిమానులకి, ప్రేక్షకులకి తన తరపున, తన టీమ్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.  వంశీ పైడిపల్లి దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్, పివిపి సంయుక్తంగా నిర్మించారు.  ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్లో మహేష్ బాబుకి జోడీగా పూజా హెగ్డే నటించడం జరిగింది.