శివాజి పాత్రలో మహేష్..?

శివాజి పాత్రలో మహేష్..?

సూపర్ స్టార్ మహేష్ దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రానున్నదన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది, సినిమా లైన్ ఏంటనేది తెలీదు. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానుల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే రాజమౌళి తన తదుపరి చిత్రం కోసం కథను సిద్దం చేశాడని, అందులో సూపర్ స్టార్ మహేష్ చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా రాజమౌళి, మహేష్ కాంబోపై అనేక రూమర్లు వస్తున్నాయి. ఇదే తరహాలో తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. రాజమౌళి తన సినిమా ఛత్రపతి శివాజి ఆధారంగా చేయనున్నాడట. ఈ సినిమాకు సంబంధించిన కథను పూర్తి చేశాడట. ఇందులో శివాజీ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ కనిపించనున్నాడట. ఈ విధంగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలీదు. అంతేకాకుండా రాజమౌళి మహేష్‌తో చేయనున్న సినిమా సెట్స్ కోసం డిజైన్ చేయిస్తున్నాడని కూడా పుకార్లు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ టైగర్ ఎన్‌టీఆర్‌లతో ఆర్ఆర్ఆర్ సినిమాను రూపొందిస్తున్నాడు. అదేవిధంగా మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. మరి వీరి కాంబో ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.