మహేష్ ఇలా చేయడం ఇదే మొదటిసారి !

మహేష్ ఇలా చేయడం ఇదే మొదటిసారి !

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమా భాధ్యతల్ని పూర్తిగా భుజానికెత్తుకున్నారు.  అందుకే సినిమా విడుదలయ్యాక కూడా ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.  రేపు హైదరాబాద్లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లను మహేష్ సందర్శించనున్నాడు.  మహేష్ ఇంతకుముందెప్పుడూ ఇలా థియేటర్ విజిట్స్ చేసింది లేదు.  అభిమానులు సైతం రేపు మహేష్ రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఇలా చేయడం వలన సినిమా వసూళ్లు ఇంకొంత ఊపందుకుంటాయనేది ఆయన ఆలోచన.  వంశీ పైడిపల్లి డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్విని దత్, పివిపిలు నిర్మించారు.