వరల్డ్ కప్ పై మహేష్ ట్వీట్.. ఇంగ్లాండ్ గెలిచింది కానీ..!!

వరల్డ్ కప్ పై మహేష్ ట్వీట్.. ఇంగ్లాండ్ గెలిచింది కానీ..!!

క్రికెట్ అంటే ప్రతి ఒక్కరికి క్రేజ్ ఉన్నది.  ఈసారి వరల్డ్ కప్ లో ఇండియా సెమిస్ లో ఇంటిబాట పట్టడం జీర్ణించుకోలేకపోతున్నారు.  ఇప్పటికి ఆ షాక్ లోనే ఉన్నారు. ఫైనల్స్ లో ఇంగ్లాండ్.. న్యూజిలాండ్ జట్లమధ్య మ్యాచ్ జరిగింది.  ఈ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠంగా సాగింది.  సూపర్ ఓవర్ కూడా టై కావడంతో.. ఐసిసి ఇంగ్లాండ్ గెలిచినట్టుగా ప్రకటించింది. 

మ్యాచ్ లో ఎక్కువ ఫోర్స్ ఇంగ్లాండ్ కొట్టడంతో ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించారు.  దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫైనల్ మ్యాచ్ గురించి ట్వీట్ చేశారు.  రెండు జట్లు విజయం కోసం తీవ్రంగా శ్రమించాయి.  ఫైనల్ గా ఇంగ్లాండ్ ను విజయం వరించింది.  కానీ, న్యూజిలాండ్ కోట్లాది మంది మనసులను గెలుచుకుంది... అని ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇండియా ఫైనల్స్ కు చేరుకొని ఉన్నట్టయితే మరోలా ఉండేదని అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.