రేపే మహేష్ స్టాచ్యూ ఆవిష్కరణ !

రేపే మహేష్ స్టాచ్యూ  ఆవిష్కరణ !

సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం రూపొందించిన సంగతి తెలిసిందే.  ఈ విగ్రహాన్ని రేపు హైదరాబాద్ తీసుకురానున్నారు.  నగరంలోని మహేష్ బాబు యొక్క ఏఎంబి సినిమాస్ ప్రాంగణంలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.  టుస్సాడ్స్ మ్యూజియంవారు విగ్రహాన్ని మ్యూజియంలో కాకుండా బయట ఆవిష్కరించడం ఇదే మొదటిసారి.  

ఆవిష్కరించిన తర్వాత అభిమానులు ప్రదర్శనార్థం సాయంత్రం వరకు విగ్రహం అక్కడే ఉంటుంది.  ఆ తరవాతి రోజు సింగపూర్ తీసుకెళ్ళిపోతారు నిర్వాహకులు.  ఈ అరుదైన మూమెంట్ కోసం చాలారోజుల నుండి ఎదురుచూస్తున్న మహేష్ అభిమానులు రేపు ఏఎంబి సినిమాస్ థియేటర్లకు పోటెత్తనున్నారు.