మహేష్ మైనపు విగ్రహం సిద్ధం !

మహేష్ మైనపు విగ్రహం సిద్ధం !

 

సూపర్ స్టార్ మహేష్ బాబుకు మరొక అరుదైన గౌరవం దక్కనుంది.  మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ఆయన మైనపు విగ్రహాన్ని తయారుచేసింది.  ఈ విగ్రహాన్ని మార్చి 25న హైదరాబాద్లోని ఏఎంబి సినిమాస్ వేదికగా మహేష్ లాంచ్ చేయనున్నాడు.  అనంతరం విగ్రహాన్ని సింగపూర్ తరలించి అక్కడి టుస్సాడ్స్ మ్యూజియంలో ఉంచనున్నారు.  టుస్సాడ్స్ మ్యూజియం వారు ఒక విగ్రహాన్ని సింగపూర్లో కాకుండా బయట ఆవిష్కరించడం ఇదే తొలిసారి.  మహేష్ బాబుకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఇకపోతే ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' అనే సినిమా చేస్తున్నాడు.