'మహర్షి' వాయిదా కన్ఫర్మ్ అయ్యేలా ఉంది !
త్వరలో రిలీజ్ కానున్న భారీ చిత్రాల్లో మహేష్ బాబు యొక్క 'మహర్షి' కూడా ఒకటి. సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తామని మొదట్లో నిర్మాతలు ప్రకటించారు. కానీ వాయినా పడుతుందనే వార్తలు బాగా హడావుడి చేశాయి. దీంతో వాయిదా నిజం కాదని, సినిమా ఏప్రిల్ 25 రోజునే వస్తుందని నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇప్పుడు మాత్రం వాయిదా ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. అంతేకాదు మే రెండవ వారంలో సినిమా రిలీజ్ ఉంటుందని చెబుతున్నారు. మరి దీనిపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి. పూజ హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)