హైదరాబాద్లో మహేష్ మైనపు బొమ్మ !

హైదరాబాద్లో మహేష్ మైనపు బొమ్మ !

సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు బొమ్మను ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు తయారుచేసిన సంగతి తెలిసిందే.   సింగపూర్లో ఉన్న టుస్సాడ్స్ మ్యూజియం కళాకారులు దీన్ని రూపొందించారు.  త్వరలోనే ఈ బొమ్మను లండన్లో ఉన్న మేడం టుస్సాడ్స్ ప్రధాన మ్యూజియంలో ఉంచుతారు.  అంతకంటే ముందే దాన్ని హైదరాబాద్ తీసుకురానున్నారు.  ఇక్కడే మహేష్ సమక్షంలో ఓపెన్ చేస్తారట.  ఈ సందర్బంగా మహేష్ అభిమానుల కోసం మైనపు బొమ్మను ఏఎంబి సినిమాస్ లో ఒకరోజు మొత్తం ఉంచనున్నారు.  ఇంకేముంది మహేష్ బాబుతో సెల్ఫీ దిగే అవకాశం దొరకలేదని ఫీలయ్యే అభిమానులంతా ఆయన మైనపు బొమ్మతో సెల్ఫీలు దిగడమే.