వైఎస్సార్ పాత్రను తెలుగులో ఎవరూ చేయరు !

 వైఎస్సార్ పాత్రను తెలుగులో ఎవరూ చేయరు !

దివంగత వైఎస్సార్ చేసిన పాదయాత్ర ఆధారంగా 'యాత్ర' అనే సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు మహి వి రాఘవ్.  ఇందులో రాజశేఖర్ రెడ్డి పాత్రను మలయాళ నటుడు మమ్ముట్టి   చేస్తున్నారు.  తెలుగులో ఇంతమంది నటులుండగా మలయాళ నటుడు వద్దకు వెళ్లాల్సిన న పనేముందనే ప్రశ్న మొదటినుంచి అందరిలోనూ ఉంది.  దీనిపై స్పందించిన రాఘవ్ ఇది వైఎస్సార్ గొప్పతనాన్ని చెప్పే సినిమా..  పైగా వైకాపా అధికారంలో కూడా లేదు.  అలాంటపుడు తెలుగులో ఏ నటుడైనా ఎందుకు ముందుకొస్తాడు.  అందుకే ఇక్కడ ట్రై చేయడం వృధా అని మమ్ముట్టి వద్దకు వెళ్ళాను.  ఆయన పాత్రకు న్యాయం చేశారు అంటూ సమధానమిచ్చాడు.  ఇకపోతే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 8న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.