తమ్ముడు దేశాధ్యక్షుడు.. అన్న ప్రధాని మంత్రి..

తమ్ముడు దేశాధ్యక్షుడు.. అన్న ప్రధాని మంత్రి..

శ్రీలంకలో 3 దశబ్దాలకు పైగా సాగిన ఎన్‌టీటీఈ పోరాటాన్ని అంతం చేసిన రాజపక్స సోదరులు... మరో సారి ఆదేశ అత్యున్నత పదవుల్ని అధిరోహిస్తున్నారు. 2005 నవంబర్‌లో 19న తొలి సారిగా అధ్యక్ష పదవి చేపట్టిన మహిందా రాజపక్స... 2015 జనవరి 9 వరకూ ఆ పదవిలో కొనసాగారు. దక్షిణాసియాలోనే అత్యధిక కాలం పాలించిన నేతగా రికార్డు సృష్టించారు. మహిందా రాజపక్స అధ్యక్షుడిగా ఉన్న సమయంలో... అతని సోదరుడు గొటబాయా రాజపక్స సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించారు. అంతకు ముందు 1970లో అతి చిన్న వయసులోనే పార్లమెంట్‌కు ఎన్నికై రికార్డు సృష్టించారు మహిందా రాజపక్స. అప్పటికి ఆయన వయస్సు 24 ఏళ్లు. 

గత ఏడాది అక్టోబర్ 26న మహిందా రాజపక్స ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టినా... దాదాపు నెలన్నర మాత్రమే ఆ పదవిలో కొనసాగారు. ప్రధాని రణిల్ విక్రమ సింఘేను తప్పించి... రాజపక్సను ఆ పదవిలో నియమించారు అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన. అయితే... దీని వల్ల దేశంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. మహిందా రాజపక్స నియామకం చెల్లదని శ్రీలంక సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో గత ఏడాది డిసెంబర్‌ 15న ప్రధాని పదవి పదవి నుంచి మహిందా రాజపక్స తప్పుకోవాల్సి వచ్చింది. తాజా ఎన్నికల్లో గొటబాయా రాజపక్స శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికవడంతో... తన అన్న మహిందా రాజపక్సను ప్రధాన మంత్రిగా నియమించారు. అంటే.. శ్రీలం అధ్యక్షుడిగా గొటబాయా రాజపక్స... ప్రధానిగా మహిందా రాజపక్స కీలక బాధ్యతలు నిర్వహిస్తారు.