ఈ ఐడియా "మహీంద్రా"కు రాలేదట

ఈ ఐడియా "మహీంద్రా"కు రాలేదట

సగటు పౌరుడికి అందుబాటు ధరల్లో లగ్జరీ వెహికల్ ని ఏ విధంగా రూపొందించాలా అని ఎన్నో రోజులుగా ఆలోచించామని.. కానీ ఇలాంటి ఐడియా తమకు తట్టనేలేదని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఓ మామూలు సైకిల్ కి సింపుల్ గా లగ్జరీ సీటును అమర్చిన ఫొటో తన కంటపడింది. దాన్ని వెంటనే ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సింపుల్ గా, లగ్జరీగా ఉన్న ఇంత గొప్ప ఐడియా తమకు తట్టడం అనుమానమేనని అబ్బురపడ్డారు.