వైసీపీలో చేరిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి

వైసీపీలో చేరిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి

వైసీపీలోకి వలసల పరంపర కొనసాగుతుంది. తాజాగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మహ్మమద్ ఇక్బాల్ వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. పాదయాత్రలో భాగంగా ఏలూరులో పర్యటిస్తున్న.. వైసీపీ అధినేత జగన్ సమక్షంలో పార్టీలో చేరారు మహ్మమద్ ఇక్బాల్. రాయలసీమ ఐజీగా గత నెలలోనే రిటైర్మెంట్ తీసుకున్నారు ఇక్బాల్. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్బాల్ ఏపీ సీఎం చంద్రబాబు వద్ద గతంలో సీఎస్ఓగా పనిచేశారు. తన పదవీకాలం మొత్తం చంద్రబాబు వద్దే పనిచేసి వైసీపీలో చేరడంపై సర్వత్రా ఆసక్తి  నెలకొంది. ముఖ్యంగా ఇక్బాల్ వైసీపీలో చేరడంపై పోలీసు వర్గాల్లోనూ చర్చ మొదలైంది.