లేటు వయసులో ఖవాజా శతకం

లేటు వయసులో ఖవాజా శతకం

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా రాంచీ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా శతకం సాధించాడు. జడేజా వేసిన 37వ ఓవర్‌ చివరి బంతికి సింగిల్‌ తీసి శతకం పూర్తిచేసాడు. ఖవాజా 100( 107 బంతుల్లో ; 11 ఫోర్లు, 1 సిక్సు) కెరీర్‌లో తొలి వన్డే శతకం సాధించాడు. అంతకు ముందు అతడి అత్యధిక స్కోరు 98. ఉస్మాన్ ఖవాజా 32 సంవత్సరాల 80 రోజులకు మొదటి శతకం చేసాడు. లేటు వయసులో మొదటి శతకం చేసిన రెండో ఆటగాడు ఉస్మాన్ ఖవాజా. ఖవాజా కంటే ముందు ఆడమ్ వోగ్స్ (33 సంవత్సరాల 129 రోజులు) ఉన్నాడు. ఖవాజా తరువాత బ్రాడ్ హాడ్జ్ (32 సంవత్సరాల 79 రోజులు), డేవిడ్ హస్సి (33 సంవత్సరాల 44 రోజులు)లు ఉన్నారు.