బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యం: తమ్మినేని

బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యం: తమ్మినేని

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యం. వామపక్ష శక్తుల బలం పెంచడం రెండో లక్ష్యం అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ రోజు ఆయన నల్గొండలో మాట్లాడుతూ... దేశంలో లౌకిక ప్రభుత్వ ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామన్నారు. టీఆర్ఎస్ విధానాలపై ప్రజలను చైతన్యం చేస్తాం. ప్రత్యామ్నాయ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎన్నికలను ఉపయోగించుకుంటామన్నారు. ఎన్నికల్లో సీపీఐతో ఒక అంగీకారం కుదిరింది. నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్ సీట్లలో సీపీఐ, సీపీఎంలు పోటీ చేస్తాయని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ఉన్న బలల ఆధారంగా పరిమితమైన పోటీకి సన్నద్ధం అయ్యాం అని తెలిపారు.

శనివారం నల్లగొండ, ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తాం అని తమ్మినేని వీరభద్రం తెలిపారు. నల్లగొండలో సీపీఎం అభ్యర్థిని ఆదరించండని కోరారు. కొన్ని చోట్ల బీఎలెఫ్ భాగస్వామ్య పార్టీల అభ్యర్థులు రంగంలో ఉంటారు. తాము పోటీ చేయని చోట బీజేపీని ఓడించే పార్టీలకు మద్దతు ఇస్తామన్నారు. టీఆర్ఎస్ చెప్తున్నట్లుగా వారు 16 స్థానాల్లో గెలిచినా చేసేది ఏమి లేదని ఆయన విమర్శించారు.