చైతు కెరీర్లోనే టాప్ వసూళ్లు

చైతు కెరీర్లోనే టాప్ వసూళ్లు

ఒకవైపు ఎన్నికలు... మరోవైపు ఐపీఎల్.. ఇలాంటి సమయంలో సినిమాలు రిలీజ్ చేయాలంటే ధైర్యం కావాలి.  పెద్ద సినిమాలైతే పెట్టిన డబ్బులు వెనక్కొస్తాయనే నమ్మకం ఉంటుంది.  నమ్మకం ఉన్నా.. రిజల్ట్ తారుమారైతే... చెప్పేదేముంది.  

ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేసి హిట్ కొడితే... ఆ సినిమాకు ఇక తిరుగుండదు.  అలాంటి సినిమానే మజిలీ.  వరస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న నాగచైతన్య... మజిలీ సినిమాతో మరలా లైన్లోకి వచ్చాడు.  

ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను బాగా చూస్తున్నారు.  మొదటి నాలుగు రోజుల్లోనే ఈ సినిమా రూ.34 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది.  ఇందులో రూ. 20 కోట్లు షేర్.  రారండోయ్ వేడుక చేద్దాం తరువాత ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన సినిమా మజిలీ కావడం విశేషం.  లాంగ్ రన్ లో ఈ సినిమా రూ.70 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.