విదేశాల్లో మజిలీ హవా !

విదేశాల్లో మజిలీ హవా !

శివ నిర్వాణ డైరెక్షన్లో నాగ చైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం 'మజిలీ'.  మొదటిరోజే మంచి పాజిటివ్ తెచ్చుకున్న సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది.  విదేశాల్లో సైతం ప్రేక్షకులు చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారు.  గురువారం ప్రీమియర్ల ద్వారా 1,63,000 డాలర్లు వసూలు చేసి శుక్రవారం నాటికి 3,00,000 డాలర్లను ఖాతాలో వేసుకుంది.  ఇక శనివారం 2,00,000 డాలర్లు రావడంతో మొత్తం హాఫ్ మిలియన్ డాలర్ రీచ్ అయింది.  ఇప్పుడప్పుడే వేరే పెద్ద సినిమాలేవీ లేకపోవడం ఈ కలెక్షన్స్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.