మజిలీ డిలిటెడ్ సీన్ వైరల్

మజిలీ డిలిటెడ్ సీన్ వైరల్

ఈ ఏడాది ఏప్రిల్ ఐదో తేదీన రిలీజైన మజిలీ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి.  సినిమాను తీసిన విధానం కానివ్వండి, నాగచైతన్య, సమంత యాక్టింగ్ కానివ్వడండి సినిమాకు ప్లస్ అయ్యాయి.  మిడిల్ క్లాస్ ప్రేక్షకులు ఈ సినిమాను ఎక్కువగా లైక్ చేస్తున్నారు.  

సినిమాలో లేని కొన్ని సీన్స్ ను యూనిట్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తోంది.  ఈ సీన్స్ చూసిన తరువాత సినిమాలో ఎంత డెప్త్ ఉందొ తెలుసుకొని థియేటర్స్ కు వస్తారని యూనిట్ ఉద్దేశ్యం.  నాగచైతన్య... తన మామ పోసాని ఇంటికి వచ్చినపుడు వచ్చే సీన్ అది.  ఆ సీన్ ఆధ్యంతం ఆకట్టుకునే విధంగా ఉండటం విశేషం.