మజిలీ ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే

మజిలీ ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే

ఏప్రిల్ 5 వ తేదీన మజిలీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  ఎన్నికల సమయం కావడంతో పాటు పెద్ద సినిమాలు ఏవీ లేకపోవడంతో మజిలీని భారీ ఎత్తున రిలీజ్ చేశారు.  ముఖ్యంగా నైజాం ఏరియాలో 200 థియేటర్లకు పైగా రిలీజ్ చేశారు.  ఒక్క నైజాం ఏరియాలో మొదటి రోజు ఈ సినిమా రూ.1.84 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది.  చైతన్య కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు.  

వరల్డ్ వైడ్ గా మజిలీ రూ. 12.05 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది.  ఏప్రిల్ 6 వ తేదీ ఉగాది కావడంతో ఈ వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది.  నాగచైతన్య కెరీర్లో ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఇదే మొదటిసారి.