బయ్యర్ల కళ్ళలో ఆనందాన్ని నింపిన మజిలీ

బయ్యర్ల కళ్ళలో ఆనందాన్ని నింపిన మజిలీ

నాగచైతన్య.. సమంత జంటగా నటించిన మజిలీ సినిమా ఏప్రిల్ 5 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది.  ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న మజిలీ... వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతున్నది.  ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి మజిలీ ప్రపంచ వ్యాప్తంగా రూ.17.35 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది.  మరో రెండు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది అనడంలో సందేహం లేదు.  నాగచైతన్య కెరీర్లో హయ్యస్ట్ వసూళ్లు సాధించిన సినిమాగా మజిలీ నిలవనుంది.  

ఆదివారం రోజున ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.64 కోట్ల రూపాయలు వసూలు చేసింది.  సినిమాకు హిట్ టాక్ రావడంతో లాంగ్ రన్ లో సినిమా రూ.50 కోట్లు వసూలు చేయడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు.