మజిలీ టీజర్: స‌చినే అవుతావో.. సోంబేరే అవుతావో

మజిలీ టీజర్: స‌చినే అవుతావో.. సోంబేరే అవుతావో

నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'మజిలీ'. దివ్యాంశ కౌశిక్ మరో కథానాయికగా నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌పెద్దిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ రోజు చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది.

'నీకో సంవ‌త్స‌రం టైం ఇస్తున్నాను.. ఈ లోగా నువ్వు స‌చినే అవుతావో.. సోంబేరే అవుతావో నీ ఇష్టం' అనే డైలాగ్ తో టీజర్ ప్రారంభయింది. 'నా ఫ్యామిలీ జోలికి రావొద్దు.. రావొద్దు', 'మా ఆయనకు మంచు ప్రదేశాలంటే మహా ఇష్టం' అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. టీజ‌ర్ లో నాగచైతన్య, సమంతలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేయ‌నున్నారు. వివాహం తరువాత ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. నాగ చైతన్య వరస ప్లాప్ లతో సతమతమౌతున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు.