షాకిస్తున్న మజిలీ ప్రీ రిలీజ్ బిజినెస్

షాకిస్తున్న మజిలీ ప్రీ రిలీజ్ బిజినెస్

వివాహం తరువాత నాగచైతన్య.. సమంతలు జంటగా కలిసి చేస్తున్న సినిమా మజిలీ.  ఈ సినిమా ఏప్రిల్ 5 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నది.  ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి జరుగుతున్నా... సినిమాపై నమ్మకంతో రిలీజ్ చేసేందుకు యూనిట్ సిద్ధం అయింది.  

మజిలీకి ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.  అంచనాలు పెరిగాయి.  ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో ఉండటం విశేషం.  తాజా సమాచారం ప్రకారం మజిలీ వరల్డ్ వైడ్ గా రూ. 21.14 కోట్ల రూపాయల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.  

క్రికెట్ అంటే ప్రాణంగా భావించే వ్యక్తి, అటు క్రికెట్ కు, ప్రేమించిన అమ్మాయికి దూరం కావడం.. ఇష్టం లేని పెళ్లి చేసుకొని జీవితంలో ఇబ్బందులు పడటం వంటి వాటిని సినిమాలో చక్కగా చూపించారట.  ఫ్యామిలీ సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి సినిమా ఎలా ఉందొ తెలియాలంటే ఏప్రిల్ 5 వరకు ఆగాల్సిందే.  ఇదిలా ఉంటె ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.  సెన్సార్ టాక్ ప్రకారం సినిమా ఫ్యామిలీ డ్రామా బాగా వర్కౌట్ అయినట్టు తెలుస్తోంది.