మనసుకు హత్తుకున్న ప్రియతమా సాంగ్

మనసుకు హత్తుకున్న ప్రియతమా సాంగ్

నాగచైతన్య హీరోగా నటిస్తున్న మజిలీ సినిమాకు సంబంధించిన సెకండ్ సాంగ్ ప్రియతమా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది.  సమంత పాయింట్ అఫ్ వ్యూలో సాంగ్ ఉంది.  చిన్న చిన్న పదాలతో తన మనసులోని భావాలను స్పష్టంగా చెప్తున్నట్టు తెలుస్తోంది.  రీసెంట్ గా రిలీజైన వన్ బాయ్ వన్ గర్ల్ సాంగ్ ఎలాగైతే యూత్ ను ఎట్రాక్ట్ చేసిందో.. ఈ సాంగ్ కూడా యూత్ ను ఎట్రాక్ట్ చేసే విధంగా ఉండటం విశేషం.  

మజిలీ సినిమా ఏప్రిల్ 5 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నది.  శివ నిర్వాణ దర్శకుడు.  ఇప్పటికే సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.  మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.