విశాఖలో భారీ అగ్ని ప్రమాదం

విశాఖలో భారీ అగ్ని ప్రమాదం

విశాఖలోని దువ్వాడ ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పూజ అండ్ స్క్రాప్ ఇండస్ట్రీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మంటలు ఎగిసిపడడంతో పాటు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు ఫైర్ సిబ్బంది. పూజా స్క్రాప్ ఇండస్ట్రీకి సంబంధించిన రెండవ క్వాలిటీ కంప్యూటరు, విడిభాగాలు, ట్రాన్స్ఫార్మర్లు, మీటర్లు, ఇతర వస్తువులు నిల్వ ఉంచుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసే ఈ వస్తువులు తయారుచేసి దేశంలో అమ్మకాలు జరుపుతారు. బహిరంగ ప్రదేశంలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండడం వలన ఎండ వేడిమి కారణంగా ప్రక్కనే వున్న ట్రాన్స్ఫార్మర్ పేలడంతో అగ్ని ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫైబర్, కాపర్ , సిల్వర్ , ఉండడం వలన మంటలు అదుపు కావడం లేదు.  పెదగంట్యాడ, స్టీల్ ప్లాంట్ సిఐఎస్ఎఫ్ , అనకాపల్లి, సబ్బవరం తదితర ప్రాంతాల నుంచి ఫ్తెర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేస్తున్నాయి. జిల్లా ఫ్తెర్,పోలీసు అధికారులు దగ్గరుండి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.....