ఈ అమ్మడి విషయంలో పట్టింపుల్లేవ్..

ఈ అమ్మడి విషయంలో పట్టింపుల్లేవ్..

నాచురల్ బ్యూటీ సాయి పల్లవిని ప్రత్యేకంగా చూస్తున్నారు మూవీ మేకర్స్. సాధారణంగా ఒక సినిమా కథను, పాత్రలను బట్టి హీరో, హీరోయిన్‌లను ఎంపిక చేస్తారు. ఎత్తు ఉన్న హీరోకి హీరోయిన్ కూడా కాస్త ఎత్తు ఉండేలా చూసుకుంటారు. కానీ నాచురల్ బ్యూటీ సాయిపల్లవి విషయంలో అలా కాదు. అమ్మడు కాస్త పొట్టిగా ఉన్నా కూడా ఆరడుగుల హీరోల పక్కన పెట్టేస్తున్నారు. ఈ అమ్మడి మొదటి సినిమా కూడా అదేవిధంగా ఆరడుగుల హీరో వరుణ్ తేజ్ సరసన చేసింది. దాంతో మేకర్స్ సాయిపల్లవి విషయంలో తమ కట్టుబాట్లను, పట్టింపులు పక్కన పెట్టేశారు. సాయి పల్లవిహైట్‌కి నాని, శర్వానంద్ వంటి మీడియాం హైట్ ఉన్న వారైతే బాగుంటుంది. అప్పుడే వారి జంట చూడముచ్చటగా ఉంటుంది. కానీ ఈ ముద్దుగుమ్మకి వాటిని పట్టించుకోకుండా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల టాలీవుడ్ భల్లాలదేవుడు రానాతో విరాట పర్వం సినిమాలో ముద్దుగుమ్మ చేసింది. రానా హైట్ ఎంత ఉంటాడనేది అందరికీ తెలిసిన విషయమే. కచ్చితంగా ఆరడుగుల పైమాటే. దాంతో ఈ సినిమాలో రానా జోడీగా సాయిపల్లవి సెట్ అవుతుందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఒకవేళ సినిమాలు వీరు జంట కాదేమో అని కూడా అంటున్నారు. ఇంతలో మరో ఆరడుగుల హీరో గోపీచంద్ సరసన కూడా ఈ అమ్మడిని అడిగారట. దర్శకుడు తేజ గోపీచంద్ హీరోగా అలమేలుమంగ-వెంకటరమణ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అందులో హీరోయిన్‌గా సాయిపల్లవిని ఎంపిక చేశారట. గోపీచంద్ కూడా పరిశ్రమలోని ఎత్తైన హీరోల్లో ఒకడు. ఈ అమ్మడికి వరుసగా ఆరడుగుల హీరోలతో అవకాశాలు రావడం విశేషం. అంతేకాకుండా అమ్మడి అభినయం ముందు హైట్ పెద్ద సమస్య కాదని మేకర్స్ అనుకుంటున్నారేమో.