వయసు పెరుగుతున్నా ఆమె ఏ మాత్రం తగ్గడం లేదు.. 

వయసు పెరుగుతున్నా ఆమె ఏ మాత్రం తగ్గడం లేదు.. 

బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ లో డ్యాన్స్ చేయాలంటే గుర్తుకు వచ్చే పేరు మలైకా అరోరా.  మలైకా అరోరా మెరుపులాంటి డ్యాన్స్ తో బాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసింది.  అప్పుడెప్పుడో వచ్చిన దిల్ సే సినిమాలో చల్ చల్ సయ్యా సయ్యా సాంగ్ ఎలా ఆకట్టుకుందో చెప్పక్కర్లేదు.  ట్రైన్ పై చేసిన ఈ సాంగ్ సినిమాకు హై లైట్ గా నిలిచినా సంగతి తెలిసిందే.  

ఈ సినిమా తరువాత మలైకా ఎన్నో సినిమాల్లో డ్యాన్స్ చేసింది.  అదరగొట్టింది.  భళా అనిపించే విధంగా డ్యాన్స్ తో ఆకట్టుకుంది.  ప్రస్తుతం ఆమె వయసు 46  ఈ వయసులో కూడా మలైకా ఏ మాత్రం తగ్గడం లేదు.  ఉదయాన్నే యోగా చేస్తూ.. జిమ్ లో గంటల తరబడి వర్కౌట్ చేస్తూ ఫిట్ గా కనిపిస్తున్న మలైకా రీసెంట్ గా బాద్రాలో రేబాక్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో కనిపించి కనువిందు చేసింది.  లూజ్ అప్పర్ వేర్ తో.. టైట్ ఫిట్ షార్ట్ తో అదిరిపోయేలా కనిపించింది.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వీర లెవల్లో ట్రెండ్ అవుతున్నది.