మలైకా అరోరా అలా అనేసిందేంటి...?

మలైకా అరోరా అలా అనేసిందేంటి...?

మలైకా అరోరా ఖాన్... భర్త అర్బాజ్ ఖాన్ నుంచి విడిపోయిన తరువాత... బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నది. ఇద్దరి మధ్య బలమైన బంధం ఉందనే విషయం అందరికి తెలిసిందే.  ఈ ఇద్దరు ఈనెలలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి.  ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం గురించి ఎన్నిసార్లు ఆ స్టార్స్ ను ప్రశ్నించినా ఎలాంటి సమాధానం లేదు.  

రీసెంట్ గా మలైకా అరోరా తన ఫ్రెండ్స్ తో కలిసి మాల్దీవులకు వెళ్ళింది.  అటు అర్జున్ కపూర్ కూడా మాల్దీవులకు చెక్కేశాడు.  అక్కడి నుంచి తిరిగి వచ్చే సమయంలో అర్జున్ కపూర్ కెమెరాకు చిక్కాడు.  మలైకా విషయం అడిగితె ఎప్పటిలాగే ఎలాంటి సమాధానం లేదు.  

అటు ఓ జాతీయ మీడియా మలైకాను ఇదే విషయం గురించి అడగ్గా.. ఆసక్తికరమైన సమాధానం చెప్పింది.  విడాకుల తరువాత తన జీవితం తెరిచి ఉంచిన పుస్తకం అని, అర్జున్ కపూర్ తో పెళ్లి విషయంపై స్పందిస్తూ.. అలాంటి వార్తల్లో నిజం లేదని, సిల్లీ స్పెక్యులేషన్స్ అని కొట్టిపారేసింది మలైకా.