మాళవిక... పోల్ పై ఎంచక్కా..!!

మాళవిక... పోల్ పై ఎంచక్కా..!!

నార్త్ నుంచి టాలీవుడ్ లోకి వచ్చిన హీరోయిన్ మాళవిక శర్మ రవితేజతో నేల టికెట్ సినిమా చేసింది.  ఈ సినిమాపై గంపెడు ఆశలు పెట్టుకుంటే.. టపీమని పడిపోయింది. సినిమా డిజాస్టర్ గా నిలవడంతో.. అవకాశాలు రాలేదు. అయితేనేం ఏమాత్రం నిరాశచెందలేదు ఈ అమ్మడు.  సినిమాలో అవకాశాలు రాకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం దుమ్మురేపుతోంది. 

రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేసింది.  పోల్ డ్యాన్స్ చేస్తున్న ఫోటో.  పోల్ డ్యాన్స్ లో పిహెచ్ డి పట్టా పుచ్చుకుంది అనుకుంటా.. నైపుణ్యంతో డ్యాన్స్ చేస్తోంది.  ఈ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. నువ్వు నీలానే ఉండు.. ఎందులోనైనా నువ్వే ఫస్ట్ గా ఉండు అనే అర్ధంతో టెక్స్ట్ పెట్టింది.  ఈ ఫోటో వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.