వరద నీటిలో చిక్కుకున్న నితిన్ చెల్లెలు

వరద నీటిలో చిక్కుకున్న నితిన్ చెల్లెలు

కేరళలో వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి.  ఒకవైపు వర్షాలు, వైపు భారీ  వరదలతో రాష్ట్రం యావత్తూ అతలాకుతలం అయిపొయింది.  దీంతో చాలా ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి.  ధనిక, పేద అని తేడా లేకుండా అంతా ఇప్పుడు కాపాడేవారికోసం ఆతృతగా చూస్తున్నారు.  

సినీనటులు జయరామ్ ఇల్లు ఇప్పటికే నీళ్ళల్లో మునిగిపోగా.. ఆయన కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.  మరో స్టార్ నటుడు మోహన్ లాల్ ఇల్లు కూడా వరద నీటిలో మునిగిపోయింది.  ఇదిలా ఉంటె, కొచ్చిలో ఉన్న హీరోయిన్ అనన్య ఇల్లు కూడా వరద నీటిలో చిక్కుకుంది. అకస్మాత్తుగా ఇంట్లోకి భారీ ఎత్తున వరదనీరు రావడంతో భయపడ్డ అనన్య కుటుంబ సభ్యులు అక్కడి నుంచి పేరంబావేరులో ఉన్న ఆమె స్నేహితురాలి ఇంటికి వెళ్లి తలదాచుకున్నారు.  తాము నివసిస్తున్న కొచ్చిలోని కాలనీలో వరద ఉదృతి ఇంకా తగ్గలేదని.. తమలాగానే చాలా మంది సహాయం కోసం ఎదురు చోస్తున్నారని అనన్య సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.  అనన్య తెలుగులో త్రివిక్రమ్ సినిమా అ ఆ సినిమాలో నితిన్ సోదరిగా నటించింది.