ఇండియాను వ్యతిరేకించిన ఆ ప్రధాని గద్దె దిగిపోయాడు... ఎందుకంటే...!

ఇండియాను వ్యతిరేకించిన ఆ ప్రధాని గద్దె దిగిపోయాడు... ఎందుకంటే...!

ఇండియా పాక్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమంటోంది.  పాక్ కు ప్రపంచంలో కొన్ని దేశాలు మాత్రమే సపోర్ట్ చేస్తుంటాయి. అలా పాక్ కు సపోర్ట్ చేసే దేశాల్లో మలేషియా కూడా ఒకటి.  ఆర్టికల్ 370రద్దు, జమ్మూ కాశ్మీర్, సిఏఏ తదితర విషయాల్లో ఇండియాకు వ్యతిరేకంగా మలేషియా మాట్లాడింది.  ఐరాసలో ఇండియాకు వ్యతిరేకంగా పాక్ కు అనుకూలంగా వ్యవహరించింది.  

ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడంతో ఆ దేశంపై ఇండియా కొన్ని చర్యలు తీసుకుంది. ఇండియా అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవద్దు అని చెప్పిన ఇండియా, మలేషియా నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్ పై నిషేధం విధించింది. ఎప్పుడైతే పామాయిల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం నిలిపివేసిందో అప్పటి నుంచి మలేషియాకు ఇబ్బందులు రావడం మొదలుపెట్టాయి.  ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పింది.  ఆర్ధిక వ్యవస్థ ఇబ్బందుల్లో పడిపోయింది. 

దీంతో మలేషియా కాళ్లబేరానికి వచ్చింది.  అయితే, ఇండియాను వ్యతిరేకించిన మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు.  అతనిపై వస్తున్న వత్తిళ్లే కారణం అని తెలుస్తోంది.  మహతీర్ తీసుకున్న నిర్ణయాలు అక్కడి మెజారిటీ ప్రజలకు నచ్చకపోవడంతో ఆయన్ను గద్దె దించారని వార్తలు వినిపిస్తున్నాయి.