'మాలేగావ్' నిందితులకు బెయిల్ 

'మాలేగావ్' నిందితులకు బెయిల్ 

మాలేగావ్‌ వరుస పేలుళ్లలో నలుగురు నిందితులకు బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. జస్టిస్‌ ఐఏ మహంతి, జస్టిస్‌ ఏఎమ్‌ బాదర్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ధాన్‌ సింగ్‌, లోకేశ్‌ శర్మ, మనోహర్‌ నర్వారియా, రాజేంద్ర చౌదరిలకు షరతులతో కూడిన బెయిల్‌ లభించింది. రూ. 50 వేలు పూచీకత్తు సమర్పించాలని, విచారణ సమయంలో ప్రతిరోజు స్పెషల్‌ కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. సాక్ష్యాలను ప్రభావితం చేసేలా ప్రవర్తించరాదనే షరతును విధించింది. 2013లో నిందితులు అరెస్ట్ అయ్యారు. 2016లో ప్రత్యేక న్యాయస్థానం వీరికి బెయిల్‌ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. 2006, సెప్టెంబరు 8న నాసిక్ సమీపంలోని మాలేగావ్‌లో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 37 మంది చనిపోగా, 100 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.