మలింగ మ్యాజిక్‌.. ఇంగ్లండ్‌కు తిప్పలు..

మలింగ మ్యాజిక్‌.. ఇంగ్లండ్‌కు తిప్పలు..

ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌కు శ్రీలంక స్టార్‌ బౌలర్‌ లసిత్‌ మలింగ చుక్కలు చూపిస్తున్నాడు. 233 పరుగలు టార్గెట్‌తో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ ఓపెనర్లను మలింగ పెవిలియన్‌కు పంపించాడు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న బెయిర్‌స్టోను తొలి ఓవర్‌ రెండో బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ చేశాడు. రెండు బౌండరీలు సాధించి జోరు మీదున్న విన్స్‌(14)ను తన స్వింగ్‌తో బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ స్కోరు 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు . క్రీజ్‌లో రూట్‌(16), మోర్గాన్‌(5) ఉన్నారు.