మల్లన్నసాగర్ పరిహారం చెక్కులు మాయం..

మల్లన్నసాగర్ పరిహారం చెక్కులు మాయం..

మల్లన్న సాగర్ ముంపు బాధితులకు చెల్లించాల్సిన పరిహారం చెక్కులు మాయమయ్యాయి... ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది... పరిహారానికి చెందిన రెండు చెక్కులు మాయం చేశారు సిద్దిపేట ఆర్డీవో సీపీ సందీప్... ఓ చెక్కు రూ. 50 లక్షలు కాగా.. మరో చెక్కు రూ.2.60 కోట్లు.. దీనిలో ఈ ఏడాది జనవరిలో రూ.50 లక్షల చెక్కు ద్వారా చాంద్ పాషా అనే వ్యక్తితో నగదు డ్రా చేయించాడు సందీప్. కొంత సమయం తర్వాత రూ.2.60 కోట్లు డ్రా చేసేందుకు యత్నించడం.. సంబంధిత బ్రాంచ్‌లో క్యాష్ లేకపోవడంతో ఈ ఘటన బయటపడింది. దీంతో మొదట సెటిల్‌మెంట్ ప్రయత్నాలు జరిగినా.. ఆ తర్వాత చాంద్ పాషాపై సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ఆర్డీవో సీసీ సందీప్‌ను విధుల నుంచి తొలగించారు ఉన్నతాధికారులు. ఇక, చాంద్ పాషా బంధువుల నుంచి రూ. 50 లక్షలు రికరీ చేశారు. ప్రస్తుతం నిందితులు స ందీప్, చాంద్ పాషా పరారీలో ఉన్నారు.