సినిమా రిలీజ్ కాకముందే యూట్యూబ్ లో ఆ సన్నివేశాలు.. ఎలా?

సినిమా రిలీజ్ కాకముందే యూట్యూబ్ లో ఆ సన్నివేశాలు.. ఎలా?

ఏదైనా సరే ఒక సినిమా రిలీజ్ చేశాక.. సినిమా బాగుంది అనుకుంటే.. ఆ సినిమాను ఇంకా ప్రమోషన్ చేసేందుకు డిలిటెడ్ సీన్స్ పేరుతో కొన్ని సీన్స్ ను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంటారు.  ఎడిటింగ్ లో తీసేసిన సీన్స్ ను యూట్యూబ్ లో పెట్టడం వలన వ్యూస్ పెరుగుతాయి.  అరె ఈ సీన్స్ బాగున్నాయి కదా.. ఎందుకు డిలీట్ చేశారు అనే డౌట్ తో ప్రేక్షకులు సినిమా చూస్తారని దర్శక నిర్మాతల అభిప్రాయం.  

అందుకోసమే ఇలాంటి సీన్స్ ను యూట్యూబ్ లో పెడుతుంటారు. అయితే, మల్లేశం సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా డీలిటెడ్ సీన్స్ ను ముందుగానే అప్లోడ్ చేశారు.  కారణం ఏంటి అంటే.. ముందుగానే ఈ సీన్స్ ను అప్లోడ్ చేస్తే.. దాని వలన సినిమాకు మరింత ప్లస్ అవుతుందని, సీన్స్ బాగున్నాయి కదా మరి సినిమా ఎలా ఉంటుందో చూద్దామని సగటు ప్రేక్షకుడు అనుకుంటారని అందుకే సీన్స్ ను అప్లోడ్ చేశారని అంటున్నారు.