ఓ వైపు మోడీ, మరోవైపు ఎంఐఎం తో దోస్తీ ...

ఓ వైపు మోడీ, మరోవైపు ఎంఐఎం తో దోస్తీ ...

సోనియా తెలంగాణ ఇచ్చినప్పుడు ఆమెతో కేసీఆర్‌ ఫొటో దిగి, ఇప్పుడు శత్రువులమంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ద్రోహం చేసిన వారికి తెలంగాణ ప్రజలు అండగా ఉంటారని విమర్శించారు. సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. సోనియా తెలంగాణ ఇవ్వకపోతే.. మీ కుటుంబం అధికారంలోకి వచ్చేదా అని ప్రశ్నించారు.

ఓ వైపు మోడీ, మరోవైపు ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు.మోడీ ప్రభుత్వానికి అనేక విషయాల్లో కేసీఆర్‌ మద్దతిచ్చారన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు, రాష్ట్రపతి ఎన్నికల్లో మోడీకి కేసీఆర్‌ అండగా నిలిచారన్నారు. నోట్ల రద్దుతో చిన్న వ్యాపారులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. దేశంలో బలహీనవర్గాలపై దాడులు పెరిగిపోయాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదని ఖర్గే విమర్శించారు.