హుజూర్‌నగర్ బైపోల్: టీఆర్ఎస్‌తో దోస్తీపై సీపీఐ తేల్చుకోవాలి..!

హుజూర్‌నగర్ బైపోల్: టీఆర్ఎస్‌తో దోస్తీపై సీపీఐ తేల్చుకోవాలి..!

హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌కు మద్దతిస్తోన్న సీపీఐ వైఖరిని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తప్పుబట్టారు. వేలమంది కార్మికులను ఉద్యోగాల నుంచి తీసేస్తున్నామని ప్రకటించిన  ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు కార్మిక పక్షపాతిగా చెప్పుకునే సీపీఐ ఎలా మద్దతిస్తోందని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్‌కు మద్దతు విషయాన్ని ఆ పార్టీ మరోసారి సమీక్షించుకోవాలన్న భట్టి... కేసీఆర్ వైఖరిని జనంలో ఎండగట్టడానికి కాంగ్రెస్‌తో కలిసి రావాలని సీపీఐని కోరారు. ఇక, తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ సొంత ఎస్టేట్ కాదన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.  కేసీఆర్ తనను తాను  ఓ రాజు, నియంత అనుకుంటున్నారని, ఇష్టమొచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ అప్పులు తీర్చలేక అమ్మకానికి పెడుతున్నామనడం సరికాదన్నారు.