ఒక్క రూపాయి అభివృద్ధి లేదు

ఒక్క రూపాయి అభివృద్ధి లేదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు టీపీసీపీ వర్కింట్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క.. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఇవాళ గాంధీభవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భట్టి పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతూ.. అంజన్ కుమార్ యాదవ్ నాయకత్వంలో హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు.. నగర అభివృద్ధికి నిజమైన కృషి చేసింది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని.. నేడు మెట్రో గురించి గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి.. నాడు మెట్రోను వ్యతిరేకించారని.. కానీ.. కాంగ్రెస్ పార్టీ మెట్రోను మొదలుపెట్టిందని ఎద్దేవా చేశారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు నేడు హాయిగా జీవిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన పరిశ్రమల వల్లనే అని.. నాలుగేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయంత అభివృద్ధి చేయలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో సేవ్ హైదరాబాద్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు.